Tuesday 11 September 2012

బిల్వ వృక్షం

         బిల్వ వృక్షాన్ని తెలుగులో మారేడు చెట్టు అంటారు. పరమశివుడికి ప్రీతికరమైనది మారేడు దళం. ఈశ్వరుడికి ఎన్నో రకాల పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించినా, వాటిలో మారేడు దళం లేకపోతే ఆ పూజ పరిపూర్ణం కానట్లే! ఎందుకంటే వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలం, కోటిమంది కన్యలను దానం చేసిన ఫలం, నోరు గోవులను దానం చేసిన ఫలం కన్నా.. ఒక్క బిల్వదళం సమర్పించడం వల్ల వచ్చే ఫలం చాలా ఎక్కువ. చెంబెడు నీటిని నెత్తిన పోసి, ఒక్క మారేడు దళాన్ని భక్తితో సమర్పిస్తే చాలు, ఆ పరమ శివుడు ఆనందంతో తబ్బిబ్బై ఇంటిముంగిట కల్పవృక్షాన్ని పాతి, కామధేనువును పెరట్లో కట్టేసి వెళతాడట. బిల్వ వృక్షం సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి హృదయం నుంచి ఉద్భవించినదని పురాణాలు చెబుతున్నాయి. బిల్వదళాలు త్రిశూలాకారంలో ఉండి, ఆ త్రినేవూతుని మూడు కన్నుల్లా, ఓంకారానికి ప్రతీకగా భాసిస్తాయి. శివపార్వతులను బిల్వ పత్రాలతో పూజించినవారికి సకల సిద్ధులు కలుగుతాయని పురాణోక్తి. బిల్వ వృక్షాన్ని చూసినా, తాకినా, గాలిపీల్చినా మనస్సు, శరీరం పవివూతమవుతాయి. పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన బిల్వవృక్షం కింద శివలింగాన్ని ఉంచి పూజిస్తే సకలపాపాలూ పటాపంచలవుతాయని ప్రతీతి. దీర్ఘరోగాలతోనూ, దుష్టక్షిగహాలతోనూ పీడించబడుతున్నవారు, అపమృత్యుదోషం ఉన్నవారు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ బిల్వదళాలతో ఈశ్వరుడిని అర్చిస్తే అన్ని అరిష్టాలూ తొలగిపోతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.

No comments:

Post a Comment