Monday 20 August 2012

చారిత్రక కట్దడాలు

అగ్ని దేవాలయం
          పార్శీలు ఆరాధించే అగ్ని దేవాలయం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఉంది. దీని నిర్మాణం 1904లో జరిగింది. ఈ దేవాలయం నిర్మించి నూరేళ్ళు పూర్తవుతున్నప్పటికీ ఇటీవలే నిర్మించారా అన్నంత ప్రశాంతంగా కనిపిస్తుంది. పార్శీలలో ముఖ్యులైన షనాయ్ వంశీయులు తిలక్‌రోడ్‌లో 190 మార్చిలో స్థలం కొనుగోలు చేసి ‘మానెక్‌బాయ్ నస్సేర్‌వాన్‌జీ షనాయ్’ పేరున ‘అగ్ని దేవాలయాన్ని’ నిర్మించారు. 1904 అక్టోబర్ 16న ఇది ప్రారంభమైంది. ఈ ఆలయం పూర్తిగా ఇండో-యూరోపియన్ నిర్మాణ శైలిలో ఉంటుంది. కేవలం సున్నం ఇటుకలతో నిర్మితమైన ఈ ఆలయం ఎంతో శోభాయమానంగా ఉంటుంది. హైదరాబాద్ అత్యంత పురాతన కట్టడాలలో ఒకటైన దీన్ని ప్రభుత్వం ‘హెరి భవనం’గా గుర్తించింది.
మక్‌బారా కళ్యాణి నవాబ్
          హైదరాబాద్ నగరానికి వన్నె తెచ్చే మరో అద్భుత నిర్మాణం ‘మక్‌బారా కళ్యాణి నవాబ్ దేవిడీ’. ఇది పాతబస్తీలోని మొఘల్‌పురాలో ఉంది. పాలరాతితో, చక్కని శైలిలో ఇది నిర్మితమైంది. నిజాంల కింద ఉన్న పలువురు నవాబులలో కళ్యాణి నవాబ్ ఒకరని చెబుతారు. ఈయన బీదర్‌లోని కళ్యాణి అనే ప్రాంతానికి చెందినవారు. అక్కడ ఉన్న ఆయన కోటను ‘కళ్యాణి నవాబు ఖిలా’గా పిలిచేవారు. 1వ శతాబ్దిలో ఆయన హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దీంతో ఇక్కడి ఆయన నివాసాన్ని ‘కళ్యాణి నవాబ్ దేవిడీ’ అని పిలవసాగారు. ఆయన మరణానంతరం ఈ దేవిడీలోనే తన సమాధిని నిర్మించారు. అప్పటి నుండి దీన్ని ‘మక్‌బార్ కళ్యాణి నవాబ్’ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న ‘కళ్యాణి బిర్యాణి’కి ఆధ్యుడు వీరేనని చెబుతారు. మొఘల్-అసఫ్‌జాహీల శైలీలో నిర్మితమైన ఈ దేవిడీ ఆదరణ లేక శిథిలావస్థకు చేరింది. ఆక్రమణకు కూడా గురవుతున్నది.
అజాఖానా-ఇ-జహ్ర
        అజాఖానా-ఇ-జహ్ర (అఘర్‌ఖానా) అన్నది ప్రార్థనా మందిరం. దీన్ని 1942లో ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ నిర్మించారు. మొహరం సందర్భంగా షియా మహ్మదీయులు ప్రార్థన చేసుకోవడానికి గాను దీన్ని కట్టారు. వాస్తవానికి నిజాం నవాబుల్లో అధికులు సున్నీ తెగకు చెందినప్పటికీ షియా తెగవారికోసం అఘర్‌ఖానాలను నిర్మించారు. అంతేకాక ఏడవ నిజాం తల్లి జోహ్ర బేగం షియా మహమ్మదీయురాలు. దాంతో తల్లి పట్ల ఉన్న గౌరవాభిమానాలతో ఆమె మరణానంతరం దీన్ని నిర్మించినట్లు చెబుతారు. ఒకేసారి 10 వేలమంది ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ఈ మందిరం ఉంది. ఎలాంటి పిల్లర్లు లేకుండా 45 అడుగుల ఎత్తునగల సీలింగ్ దీనికి ప్రధానమైన ఆకర్షణ.
సికింద్రాబాద్ క్లబ్
  
         మన జంట నగరాల్లోని అతి పురాతన క్లబ్ ‘సికింద్రాబాద్ క్లబ్’. దీన్ని 17 ఏప్రిల్ 26న స్థాపించారు. బ్రిటిషు పాలన సమయంలో సివిల్, మిలిటరీ ఉన్నతాధికారులు మాత్రమే ఈ క్లబ్‌లో సభ్యులుగా ఉండేవారు. 20 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ క్లబ్ భవనం చూడ ముచ్చటగా ఉంటుంది. మొదట్లో దీన్ని ‘పబ్లిక్ రూమ్స్’ అని పిలిచేవారు. తర్వాత సికింవూదాబాద్ గారిసన్ క్లబ్, సికింద్రాబాద్ జింఖానా క్లబ్, యునైటెడ్ సర్వీస్ క్లబ్ వంటి పలు పేర్లతో పిలవబడింది. ప్రస్తుతం దీన్ని ‘సికింద్రాబాద్ క్లబ్’ అంటున్నాం. దీనికి అనుబంధంగా గోల్ఫ్‌క్లబ్, బోట్స్‌క్లబ్, బాల్‌రూం, గ్రంథాలయం తదితరాలు ఉన్నాయి. నేటికీ ఈ క్లబ్‌లో సభ్యత్వం పొందాలంటే దశాబ్దికాలం పడుతుందంటారు.

No comments:

Post a Comment