Monday 3 September 2012

వీర తెలంగాణ నాది 

వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది
వేరై కూడ తెలంగాణ వీరతెలంగాణ ముమ్మటికి
తెలంగాణ వేరై నిలచి భారతాన వెలయు ముమ్మటికి

వీర తెలంగాణము వైనంతో భారత పౌరుని ధీధైర్యంతో
ప్రజావాణి నా గొడవ మిన్న ‘ప్రజా’ ప్రకటన జేస్తున్నది

వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది
వేరై కూడ తెలంగాణ వీరతెలంగాణ ముమ్మటికి
తెలంగాణ వేరై నిలచి భారతాన వెలయు ముమ్మటికి

దోపిడి జేసే ప్రాంతేతరులను
దూరము దాక తన్ని తీరుతం
ప్రాంతం వాడే దోపిడీ జేస్తే
ప్రాణం తోనే పాతర వేస్తం

దోస్తుగ వుండే వారితో మేమును
దోస్తే చేస్తం ప్రాణం ఇస్తాం
‘ఎంతకు అంత’ అన్న నీతితో
చింత మాని బ్రతుకును సాగిస్తాం

తెలంగాణ ‘బాషిందా’ బ్రతుకు
తెలిపిన తరతరాల సత్యమిది
కన్నడులు మహారాష్ర్టులు తుర్కీ
అన్నయ్యల తరతరాలేరినది
గుజరాతీ, మార్వాడి పారిసీ
గుజ్జన గూళ్లు అనుభవించినది
కాబూలీ ఈరాని భయిలకు
కనువిప్పుగ మెలిగిన విధమిది
తెలంగాణమిది తెలంగాణమిది
తీరానికి దూరాన ఉన్నది
ముంచే యత్నము చేస్తే తీరము
మునుగును తానే తీరము తప్పక

జైహింద్ జై తెలంగాణ తెలంగాణ జిందాబాద్
భారతమాతాకీ జై తెలంగాణ జిందాబాద్

No comments:

Post a Comment